ముంబై: మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులను ఒక రోజు సెలవుపై పంపితే హిందువులు తమ సత్తా చూపిస్తారని అన్నారు. ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ దీనిపై స్పందించారు. మసీదులోకి అడుగుపెడితే స్ట్రెచర్‌పై తిరిగి వెళ్తావంటూ వార్నింగ్ ఇచ్చారు. (Waris Pathan Threatens Nitesh Rane) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.
కాగా, వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే, గురువారం సాంగ్లీలో ప్రసంగించారు. 24 గంటలపాటు పోలీసులను సెలవుపై పంపితే, హిందువులు తమ సత్తా చూపుతారని అన్నారు. లవ్ జిహాద్ కేసు ఎదుర్కొంటే ఆ వ్యక్తి ఎముకలు విరగొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం తనకు ఫోన్ చేస్తే ఏమీ జరుగకుండా చూస్తానని అన్నారు. సెప్టెంబరు 2న అహ్మద్‌నగర్‌లో జరిగిన సకల్ హిందూ సమాజ్ ర్యాలీ సందర్భంగా కూడా నితీశ్ రాణే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రామగిరి మహారాజ్‌ను తాకడానికి లేదా చూడడానికి ధైర్యం చేసేవారిని మసీదులో వెంటాడి కొడతామని అన్నారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే వివాదస్పద వ్యాఖ్యలపై ఎంఐఎం నేత, మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ శుక్రవారం స్పందించారు. రాణే రెచ్చగొట్టే వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘మసీదులోకి ప్రవేశించడానికి ధైర్యం చేస్తే, తానుగా బయటకు వెళ్లలేడు. స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వస్తుంది’ అని ఎక్స్ పోస్ట్‌లో అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో అల్లర్లు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వారిస్ పఠాన్ ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నితీశ్ రాణేను అదుపు చేసేందుకు సీఎం ఏక్నాథ్ షిండే, కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
Sangli, Maharashtra: BJP leader Nitesh Rane says, “Send the police on 24 hours leave. We Hindus will come out to show our strength…”
Date: 19/09/24 pic.twitter.com/H4EMhsjo6Z
— IANS (@ians_india) September 20, 2024
“ कुत्तों के भौंकने से शेरों को फ़रक नहीं पड़ता “:(waris pathan ) सुनिए 👇
BJP के चिंटू नीतेश राने ने सांगली में फिर भड़काऊ भाषण दिया कहा २४ घंटे के लिए पुलिस हटा दो अपनी ताक़त बता देंगे।SC की गाइडलाइन्स के हिसाब से ये भड़काऊ भासन है पर महाराष्ट्र की सरकार इस पर कोई करवाई नहीं… pic.twitter.com/ALzrpbLflq
— Waris Pathan (@warispathan) September 20, 2024