Aadhaar Card Address Update | అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు..!
Aadhaar Card Address Update | అదేవిధంగా వయసు పెరిగినా కొద్ది ముఖంలో మార్పులు వస్తుంటాయి. కాబట్టి ఆధార్‌కార్డుపై ఫొటోలన అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆధార్‌లో ఏ అప్డేట్ కావాలన్నా అడ్రస్ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. సరైన అడ్రస్ ప్రూఫ్‌లు లేక చాలా మంది ఆధార్‌కార్డు ఆప్డేషన్కు ఆపసోపాలు పడుతుంటారు. అయితే, ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్‌కార్డును అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

న్యూఢిల్లీ : ప్రస్తుతం ఆధార్ కార్డు ( Aadhaar card ) అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరంగా మారింది. యూఐడీఏఐ జారీచేసే 12 అంకెల విశిష్ట గుర్తింపు కార్డుకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. దేశంలోని ఏ వ్యక్తి సమాచారమైనా ఆధార్ కార్డు ద్వారా ఈజీగా తెలిసిపోతుంది. ఒకసారి అధార్ కార్డు పొందామంటే ఇక పని అయిపోయినట్లే అనుకుంటే పొరపాటే. అడ్రస్ మారిన ప్రతిసారి ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే గ్యాస్ కనెక్షన్, ఫోన్ కనెక్షన్ లాంటివి పొందడం కష్టమవుతుంది.
అదేవిధంగా వయసు పెరిగినా కొద్ది ముఖంలో మార్పులు వస్తుంటాయి. కాబట్టి ఆధార్‌కార్డుపై ఫొటోలన అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆధార్‌లో ఏ అప్డేట్ కావాలన్నా అడ్రస్ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. సరైన అడ్రస్ ప్రూఫ్‌లు లేక చాలా మంది ఆధార్‌కార్డు ఆప్డేషన్కు ఆపసోపాలు పడుతుంటారు. అయితే, ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్‌కార్డును అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటివరకు ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పులు చేయటాలంటే పాస్‌పోర్టు, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేస్తేనే అధార్‌కార్డు అప్డేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం యూఐడీఎఐ ఇచ్చిన వెసులుబాటుతో బంధువులు, ఇతర కుటుంబసభ్యుల అధార్‌కార్డును ప్రూఫ్‌గా ఉపయోగించుకుని మన ఆధార్‌కార్డును అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ అప్డేట్ చేసుకోండి ఇలా..
- ముందుగా https://uidai.gov.in/ వెబ్ సైట్ లింకును ఓపెన్ చేయాలి.
- లింక్ ఓపెన్ కాగానే కుటుంబసభ్యుల అధార్ కార్డుతో లాగిన్ అవ్వాలి.
- అనంతరం అధార్ కార్టును కాంటాక్ట్ నెంబర్‌తో వెరిఫై చేసుకోవాలి.
- అప్పుడు మీ అధార్ అడ్రస్ మార్చుకునేందుకు ఓ అప్రూవల్ లింక్ వస్తుంది.
- వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మనకు ఏ అడ్రస్ అయితే కావాలో దాన్ని ఎంటర్ చేయాలి.
- రిక్వెస్ట్ చేసేముందు మీ కాంటాక్ట్ నెంబర్‌ను ఒకసారి వెరిఫై చేసుకోవాలి.
- అనంతరం మీ అధార్ అడ్రస్ మార్చుకునేందుకు 28 అంకెల సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత అడ్రస్ మార్చుకునేలా రిక్వెస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం ఓ సీక్రెట్ పిన్ నెంబర్ మీ కొత్త చిరునామాకు పోస్ట్ ద్వారా వస్తుంది.
- ఆ సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేసి అధార్ అడ్రస్ రివ్యూ ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా మీ అధార్‌లో అడ్రస్ అప్డేట్ అవుతుంది.
ఇవి కూడా చదవండి
మనవడితో కలిసి బామ్మ నాగినీ డ్యాన్స్.. వైరల్ వీడియో
Video viral : ఓ యువజంట బరితెగింపు.. రన్నింగ్ బైక్‌పైనే రొమాన్స్..!
Tokyo Olympics : జావెలిన్ త్రోలో ఫైనల్స్‌కు నీరజ్ చోప్రా అర్హత
UAE Lifts Ban : నిషేధం ఎత్తివేసిన యూఏఈ.. అనుమతి ఎవరికంటే?
Accident : మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృత్యువాత
TTD : నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
Andhrapradesh : ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Adhaar Card
- uidai
- updation
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

