ఢిల్లీలోని రోహింగ్యా క్యాంప్‌ను కూల్చిన యోగి సర్కార్.. ఎందుకంటే..?
కూల్చివేతలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం కాకుండా పొరుగునే ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో కూడా కొనసాగించి ఔరా! అని ముక్కున వేలేసుకునేలా చేశారు.

లక్నో : భూ ఆక్రమణలను సహించేది లేదంటూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటున్నది. మాటలు చెప్పడమే కాకుండా ఇప్పటికే పలు ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. ఎక్కడ భూమి ఆక్రమించినట్లు ఆరోపణలు వినవచ్చినా తమ బుల్డోజర్లను పంపి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నది. అయితే, ఈ కూల్చివేతలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం కాకుండా పొరుగునే ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో కూడా కొనసాగించి ఔరా! అని ముక్కున వేలేసుకునేలా చేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఢిల్లీలోని మదన్‌పూర్ ఖదర్ ప్రాంతంలో 2.10 హెక్టార్లు భూమి ఉన్నది. ఈ భూమి సాగునీటి శాఖ పరిధిలో ఉన్నది. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం ఈ భూమి విలువ రూ.150 కోట్ల పైమాటే. అయితే, గత కొంతకాలంగా ఈ భూమిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సాగునీటి శాఖ ఆజమాయిషీ లేకపోవడంతో.. అక్కడ రోహింగ్యా క్యాంప్ ఏర్పడింది. దాంతో ఈ విషయం ఆనోటా ఈనోటా యోగి ఆదిత్యానాథ్ చెవికి సోకాయి. అంతే, ఉన్నపళంగా తమ బుల్డోజర్లను పంపి రోహింగ్యా క్యాంప్‌లో వేసిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం ప్రారంభించింది. తమ ప్రభుత్వానికి చెందిన 2.10 హెక్టార్ల భూమి పరుల పరం కాకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు యోగి సర్కార్ చెప్తున్నది. రోహింగ్యా క్యాంప్‌ను తొలగించి తమ భూమిని కాపాడాలని గతంలో పలుమార్లు ఉత్తరప్రదేశ్ అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదు. దాంతో తామే నేరుగా చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాల్స వచ్చిందని యూపీ ఆర్డబ్ల్యూఏ అధికారులు చెప్తున్నారు.
మదన్‌పూర్ ఖదర్ ఖబ్రస్తాన్ ఎదురుగా ఉన్న ఈ ఖాళీ ప్రాంతంలో రోహింగ్యాలు గుడారాలు ఏర్పాటుచేసుకుని ఉంటున్నారు. వీరికి ఢిల్లీ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించింది. లాక్డౌన్ సమయంలో ఇక్కడి రోహింగ్యాలకు ఢిల్లీ ప్రభుత్వంతోపాటు ఓఖ్లా శాసనసభ్యుడు అమానుల్లా ఖాన్ రేషన్ కూడా సరఫరా చేశారు. రోహింగ్యా ముస్లింలు భారతదేశ భద్రతకు ముప్పు అని కేంద్ర ప్రభుత్వం స్వయంగా సుప్రీంకోర్టులో పేర్కొన్నది. ప్రభుత్వం వారిని దేశం నుంచి తరిమికొట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఈ శాండ్విచ్ చాలా కాస్లీ గురూ!
తొలి త్రైమాసికంలో అదరగొట్టిన హిందూస్తాన్ యూనిలీవర్
ఉయ్ఘర్ ముస్లింలపై హింసకు చైనా నిర్బంధ కేంద్రాలు
చైనాలో విషాదం.. హైవే టన్నెల్ నీటిలో చిక్కుకుని 13 మంది మృతి
న్యాయం కోసం ఎదురుచూస్తూ చనిపోయిన 108 ఏండ్ల వ్యక్తి
ఢిల్లీలో రైతు పార్లమెంట్.. షరతులతో అనుమతి
చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

