కరోనా వేళ ఆశాకిరణంగా యోగా: ప్రధాని మోదీ
ఆశాకిరణం| యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరుజరుగుతున్న వేళ యోగా ఆశాకిరణంగా మారిందన్నారు.

న్యూఢిల్లీ: యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరుజరుగుతున్న వేళ యోగా ఆశాకిరణంగా మారిందన్నారు. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుందని, దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కరోనా నుంచి రక్షణకు శారీరక దృఢత్వం పెంచుకోవాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతున్నాయని తెలిపారు. యోగాను ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోని ప్రతి మూలా లక్షలాది మంది యోగా సాధకులుగా మారారని ప్రధాని అన్నారు.
యోగా ద్వారా మంచి ఆరోగ్యం సమకూరుతుందని, దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని మోదీ చెప్పారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుందని, అంతర చైతన్యం పెంపొందుతుందని వెల్లడించారు. కరోనా వేళ యోగా ఆశా కిరణంగా మారిందని పేర్కొన్నారు. ముందస్తు రక్షణ కవచంగా యోగా ఉపయోగపడుతుందని చెప్పారు.
కరోనాతో భారత్ సహా పలుదేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయన్నారు. దీంతో రెండేండ్లుగా బహిరంగ కార్యక్రమాలు లేవని, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సామూహిక కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్పారు. విపత్తు వేళ యోగా పట్ల ప్రజలు ఉత్సాహం కనబరుస్తున్నారని, ‘వన్ వరల్డ్-వన్ హెల్త్’ సాధనకు ఇది ఉపయుక్తమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలకు కూడా యోగా యాప్ అందుబాటులోకి వచ్చిందని, ఆయా ప్రాంతాల భాషలకు అనుగుణంగా యాప్లు వచ్చాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

