Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Diwali festival | దీపావళి ఫెస్టివల్ తర్వాత దేశ రాజధాని ఢిల్లీని(Delhi )కాలుష్యం కమ్మేసింది. ఆదివారం రాత్రి ప్రజలు భారీగా పటాకులు( Firecrackers)కాల్చడంతో గాలి నాణ్యత మరింత దిగజారింది.
Diwali festival | దీపావళి ఫెస్టివల్ తర్వాత దేశ రాజధాని ఢిల్లీని(Delhi )కాలుష్యం( Pollution)కమ్మేసింది. ఆదివారం రాత్రి ప్రజలు భారీగా పటాకులు( Firecrackers)కాల్చడంతో గాలి నాణ్యత మరింత దిగజారింది. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ)371కి చేరింది. దీంతో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటగిరీలో నమోదయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. నగరంలోని మొత్తం 59 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లో 19 చోట్ల ఏక్యూఐ ‘సీవియర్’ స్థాయికి చేరింది. మరో ఏడు కేంద్రాల్లో ‘పూర్’, మిగిలిన 33 కేంద్రాల్లో ‘వెరీ పూర్’ స్థాయిలో నమోదైంది. జహంగీర్‌పురిలో అత్యధికంగా 460 ఏక్యూఐ నమోదైంది. ఆదివారం ఢిల్లీ సగటు ఏక్యూఐ 376గా నమోదైంది.
కాగా, నగరంలో శీతాకాలంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 6 నుంచి ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) మూడో దశను అమల్లోకి తెచ్చింది. ఏక్యూఐ 401-500 మధ్య నమోదైనప్పుడు ఈ దశను అమలు చేస్తారు. ఇందులో భాగంగా నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం విధించారు. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ నాలుగు చక్రాల వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. ప్రజలు నిబంధనలు పాటించి వాయి కాలుష్యం తగ్గించాలని అధికారులు సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

