యాస్ తుఫాన్ ఎఫెక్ట్: 90 రైళ్లను రద్దు చేసిన ఈస్ట్‌కోస్ట్ రైల్వే
Trains Cancelled: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ రాగల 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో

భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ రాగల 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్గానూ మారుతుందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ మే 26 ఉదయానికి ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
ప్రస్తుతం ఈ తుఫాన్ పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 530 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని, ఈ నెల 26న అది ఒడిశాలోని పారాదీప్-బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. యాస్ తుఫాన్ ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై తీవ్రప్రభావాన్ని చూపనుందన్నారు.
ఈ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైలు సర్వీసులను రద్దు చేసింది. భువనేశ్వర్- పూరి, పూరి-చెన్నై మధ్య నడిచే 90 రైళ్లు రద్దయ్యాయి. మరో 10 రైళ్ళను కూడా రద్దుచేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో గంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

