న్యూఢిల్లీ, జూలై 8: రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఖాతాలను తాను బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం చేసిన ఆరోపణను ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ తిరస్కరించింది. జూలై 3న రాయిటర్స్తోసహా భారత్‌లోని 2,000కు పైగా ఎక్స్ ఖాతాలకు బ్లాక్ చేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు అందాయని మంగళవారం ఎక్స్ వెల్లడించింది.
ఒక గంటలోపల అన్ని ఖాతాలను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపింది. అయితే ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో ఎక్స్ వాదనను తోసిపుచ్చింది. జూలై 3న తాము అటువంటి ఉత్తర్వు ఏదీ ఇవ్వలేదని ప్రకటించింది.