Vinesh Phogat | వినేష్ ఫోగాట్‌కు ఊరట.. ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతి
Vinesh Phogat : భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు భారీ ఊరట లభించింది. ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతించింది. ఈ విషయంలో వినేష్ ఫోగాట్‌కు అనుమతిస్తూ ఇప్పటికే ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది.
Vinesh Phogat : భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు భారీ ఊరట లభించింది. ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతించింది. ఈ విషయంలో వినేష్ ఫోగాట్‌కు అనుమతిస్తూ ఇప్పటికే ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. రెజ్లింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ జరిపి, వినేష్ ఫోగాట్‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.
దీంతో శనివారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కాబోయే ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేష్ ఫోగాట్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు వినేష్‌కు సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ‘‘మేం ఈ విషయంలో జోక్యం చేసుకోలేం. మీరు వెళ్లి ఆసియా గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు. ఈ దశలో వెనక్కి రావాలని వినేష్‌కు ఆదేశాలివ్వలేం. ఆమె గతంలో దేశాన్ని గర్వపడేలా చేశారు. ఇప్పటికే కోర్టు వినేష్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో ఇంకేం చేయలేం” అని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెల 30, 31 తేదీల్లో వినేష్ ఫోగాట్ ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనబోతుంది. దీనికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
అయితే, ఈ నిర్ణయాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు బెంచ్ తన పరిధి దాటిందని, వినేష్ అనర్హురాలైనప్పటికీ ఆమెకు కోర్టు అనుమతించిందని తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే సమయంలో ఈ పిటిషన్ నేపథ్యంలో వినేష్ ఫోగాట్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

