Adoptive Parents Return Child | చెడు అలవాట్లవల్ల పిల్లాడ్ని తిరిగి ఇచ్చేస్తామన్న పేరెంట్స్.. దత్తత రద్దు చేసిన కోర్టు
Adoptive Parents Return Child | పిల్లవాడి చెడు అలవాట్లు భరించలేని దత్తత తల్లిదండ్రులు ట్రస్ట్‌కు తిరిగి అప్పగిస్తామని చెప్పారు. దీంతో ఆ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ బాలుడితో అనుబంధం పెంచుకోలేకపోతున్నట్లు దత్తత పేరెంట్స్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లవాడి దత్తతను కోర్టు రద్దు చేసింది.
ముంబై: పిల్లవాడి చెడు అలవాట్లు భరించలేని దత్తత తల్లిదండ్రులు ట్రస్ట్‌కు తిరిగి అప్పగిస్తామని చెప్పారు. దీంతో ఆ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ బాలుడితో అనుబంధం పెంచుకోలేకపోతున్నట్లు దత్తత పేరెంట్స్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లవాడి దత్తతను కోర్టు రద్దు చేసింది. (Adoptive Parents Return Child) మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. 2023 ఆగస్ట్ 17న బాల ఆశా ట్రస్ట్ నుంచి ఒక బాలుడ్ని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. అయితే పిల్లవాడి చెడు అలవాట్లు భరించలేక తిరిగి అప్పగిస్తామని ట్రస్ట్‌కు చెప్పారు.
కాగా, పిల్లవాడి పెంపకంపై కౌన్సిలింగ్‌కు వెళ్లాలని ఆ ట్రస్ట్ సూచించింది. దీంతో దత్తత తల్లిదండ్రులు రెండుసార్లు కౌన్సిలింగ్‌కు వెళ్లారు. అయినప్పటికీ ఏడేళ్ల సొంత కుమార్తె మాదిరిగా దత్తత బాలుడితో అనుబంధం, మమకారాన్ని పెంచుకోలేకపోయారు. చెడు అలవాట్లు భరించలేక ఆ బాలుడ్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పడంతో ఆ ట్రస్ట్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
మరోవైపు 2023 డిసెంబర్లో బాల ఆశా ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఆర్ఐ చాగ్లా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. దత్తత తల్లిదండ్రులు ఆ బాలుడితో అనుబంధాన్ని పెంచుకోలేక పోవడంతో పిల్లవాడి శ్రేయస్సు దృష్ట్యా దత్తతను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దత్తత పేరెంట్స్ చేసిన రెండు లక్షల డిపాజిట్‌ను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. దత్తత తల్లిదండ్రులు ఆ బిడ్డకు సంబంధించిన అన్ని ఒరిజినల్ డ్యాకుమెంట్లు, పత్రాలను వెంటనే ఆ ట్రస్ట్‌కు అప్పగించాలని కోర్టు పేర్కొంది. అలాగే ఆ బాలుడ్ని తిరిగి ఉచితంగా దత్తత ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయాలని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

