Viral news : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన కూతురు పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోయింది. పెళ్లి షాపింగ్‌కు పోతున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన అత్తా అల్లుడు అటు నుంచి అటే జంప్ అయ్యారు. దాంతో రెండు కుటుంబాల వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పారిపోయిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కన్న కూతురి కోసం ఆ తల్లిదండ్రులు వరుడిని వెతికారు. తన కూతురి కాపురం బాగుండాలని, కలకాలం ఏ కష్టం లేకుండా సుఖంగా జీవించాలని కోరుకున్నారు. పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. మరో 9 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుదిరినప్పటి నుంచి కాబోయే అల్లుడు రాకపోకలు సాగించడంతో.. అతడిపై కాబోయే అత్త మనసు పారేసుకుంది. దాంతో అత్త, అల్లుడు శారీరకంగా దగ్గరయ్యారు.
ఈ క్రమంలో పెళ్లికి తొమ్మిది రోజుల ముందు ఇరు కుటుంబాలను, బంధువులను షాక్ గురిచేశారు. పెళ్లి షాపింగ్ చేస్తామని వెళ్లి జంప్ అయ్యారు. ఈ షాకింగ్ ఘటనపై లేచిపోయిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.