ఫిట్నెస్, వర్కౌట్స్ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. పలు వీడియోలు నెటిజన్లకు స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. కాగా, ఫిట్నెస్తో డ్యాన్స్‌ను జోడించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ముగ్గురు మహిళలు ట్రెడ్‌మిల్‌పై గార్భా చేస్తూ ఆకట్టుకున్నారు.
ఈ వీడియోను ‘గార్భా వరల్డ్’ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్చేసింది. ఇందులో ముగ్గురు మహిళలు ట్రెడ్‌మిల్‌పై గుజరాతీ నృత్యం గార్భా చేస్తూ ఆకట్టుకున్నారు. వెనుక ‘గార్భేకీ రాత్’ పాట ప్లే అవుతుంటే ట్రెడ్‌మిల్‌పై ఆ మహిళలపై అద్భుతంగా గార్బా నృత్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ లక్ష మందికిపైగా వీక్షించారు. అయితే, ఈ వీడియోకు నెటిజన్లనుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు అద్భుతంగా డ్యాన్స్ చేశారు అని కామెంట్ చేస్తే.. చీరకట్టుకొని ట్రెడ్‌మిల్‌పై నృత్యం చేయడం సురక్షితం కాదని మరికొందరు వ్యాఖ్యానించారు.