Women’s Reservation Bill | మరికాసేపట్లో రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు-2023 లోక్‌సభ (Lok Sabha)లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లు మరికాసేపట్లో రాజ్యసభ (Rajya Sabha ) ముందుకు రానుంది. దీనిపై సభలో చర్చ నిర్వహించనున్నారు.
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు-2023 లోక్‌సభ (Lok Sabha)లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లు మరికాసేపట్లో రాజ్యసభ (Rajya Sabha ) ముందుకు రానుంది. దీనిపై సభలో చర్చ నిర్వహించనున్నారు. చర్చ అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే, ఈ బిల్లుకు విపక్ష సభ్యులు మద్దతు తెలుపుతుండటంతో ఎగువ సభలో బిల్లు ఆమోదం పొందడం లాంఛనంగా కనిపిస్తోంది. ఉభయ సభల ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముద్రతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే, నియోజకవర్గాల పునర్విభజన పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
మరోవైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈనెల 19వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై 20వ తేదీన అంటే బుధవారం చర్చ జరిగింది. అదే రోజు ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 456 మంది ఎంపీల్లో 454 మంది అనుకూలంగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా ఓటేశాయి. మహిళా సాధికారత విషయంలో అధికార, విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచాయి. దీంతో బిల్లుకు దిగువ సభలో ఆమోద ముద్ర పడింది. కొత్త పార్లమెంట్లో ఆమోదం పొందిన తొలి చారిత్రాత్మక బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచింది.
Also Read..
Donald Trump | మా నాన్న డొనాల్డ్ ట్రంప్ చనిపోయారు.. జూనియర్ ట్రంప్ ట్వీట్ వైరల్
KTR | నా సీటు వదులుకోవడానికీ సిద్ధం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Women’s Reservation Bill | ఒంటి చేత్తో దేశాలను పాలిస్తున్న మహిళా నాయకులు వీళ్లే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

