న్యూఢిల్లీ : ప్రాదేశిక సైనిక(టెరిటోరియల్ ఆర్మీ) బెటాలియన్లలోకి మహిళా క్యాడర్ను తీసుకొనే విషయాన్ని భారత సైన్యం పరిశీలిస్తోంది. తొలుత పరిమిత బెటాలియన్లలో వీరి రిక్రూట్మెంట్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆర్మీ భావిస్తున్నది. మహిళా క్యాడర్ పనితీరుపై వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఇతర బెటాలియన్లలోనూ మహిళా సైనికులను నియమించుకొంటారు.
ఇప్పటివరకు సైన్యానికి సంబంధించి ఇంజినీరింగ్, సిగ్నల్స్, ఎయిర్ డిఫెన్స్, సర్వీస్ కోర్, ఇంటెలిజెన్స్ కోర్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ తదితర 10 బెటాలియన్లలో మహిళలు పని చేస్తున్నారు.