లండన్ : హాలీవుడ్లో బార్బీ ఫీవర్ స్కైరేంజ్లో ఉండగా గ్రెటా గెర్విగ్ బార్బీ, క్రిస్టఫర్ నోలన్ ఓపెన్హీమర్ జులై 21న విడుదలై భారీ కలెక్షన్స్‌తో దూసుకెళుతున్నాయి. బార్బీ ఫిల్మ్ యూనిట్ పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన మూవీ నుంచి ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ ఓ మహిళ బార్బీ (Viral Video) బ్యాండ్వ్యాగన్లో చేరింది.
పాపులర్ అండర్‌వాటర్ పెర్ఫామర్ క్రిస్టినా మకుషెంకో లేటెస్ట్ ఇన్స్టాగ్రాం వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చారు. హీల్స్ ధరించిన క్రిస్టినా పింక్ బాడీసూట్తో దువా లిపాస్ డ్యాన్స్ ది నైట్ సాంగ్‌కు స్టైలిష్ మూమెంట్స్‌తో అదరగొట్టింది. బార్బీ మూవీలోని ఈ సాంగ్‌కు క్రిస్టినా లయబద్ధమైన క్రేజీ మూమెంట్స్‌తో ఆకట్టకుంది.
అండర్‌వాటర్ బార్బీ డ్యాన్స్ ఇలా ఉంటుంది..అసలు ఈ సీన్‌ను సినిమాలో వారు ఎందుకు యాడ్ చేయలేదు…ప్రస్తుతం నా ఇన్స్టాగ్రాం ఫీడ్ అంతా బార్బీ రీల్స్‌తో నిండిపోయిందని క్రిస్టినా రాసుకొచ్చింది. ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఓ మై గాడ్ పిజిక్స్ అంటే మీకు జోక్‌నా అని ఓ యూజర్ ప్రశ్నించగా, నేను బార్బీ సినిమాకు వెళ్లకపోవచ్చు..గంటల తరబడి మీ ఛానెల్‌ను చూస్తా అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :