న్యూఢిల్లీ : జంతువులు ఎంతో దూకుడుగా తెలివిగా వ్యవహరించే వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. వీటిని చూసి ప్రపంచంలో జంతువులు అసాధారణ తెలివితేటలు కలిగిన వాటిలో ఒకటని అనుకుంటే పొరపాటే. కోతి తీసుకున్న కళ్లజోడును తిరిగి పొందేందుకు ఓ మహిళ చూపిన చొరవ, తెలివితేటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళ సమయస్ఫూర్తికి ఫిదా అయ్యారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కళ్లజోడు పెట్టుకుని మెట్లను ఎక్కుతుండగా దగ్గరలో ఉన్న కోతి అమాంతం దూకి వ్యక్తి కళ్లజోడును గుంజుకుని మెట్లపై ఓ మూల కూర్చుండటం కనిపిస్తుంది. కళ్లజోడును కోతి ఆసక్తిగా పరిశీలిస్తుండగా మహిళ కోతికి కొన్ని పండ్లు అందిస్తుంది.
దీంతో కళ్లజోడు విషయం పక్కనపెట్టిన కోతి పండ్లపై దృష్టి సారిస్తుంది. ఇదే అదనుగా మహిళ కళ్లజోడును దాన్నుంచి తీసుకుని ఆ వ్యక్తికి అందచేయడం ఈ వైరల్ క్లిప్‌లో చూడొచ్చు. ఈ వీడియోను ఏకంగా పది లక్షల మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. మహిళ ఎంతో తెలివిగా పరిస్ధితిని హ్యాండిల్ చేశారని కొందరు కామెంట్ చేయగా కోతి పట్ల మరికొందరు సానుభూతి చూపారు.