Maharashtra | అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ.. ప్రమాదవశాత్తు మంచం మీద నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమెను మంచంపై ఉంచేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఎందుకంటే బాధిత మహిళ 160 కిలోల బరువు ఉండటమే కారణం.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని థానే పట్టణానికి చెందిన ఓ 62 ఏండ్ల మహిళ 160 కేజీల బరువు ఉంది. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచంపై నిద్రిస్తున్న ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దీంతో ఆమెను పైకి లేపి మంచంపై పడుకోబెట్టేందుకు కుటుంబ సభ్యులకు కష్టమైంది. చేసేదేమీ లేక థానే అగ్నిమాపక సిబ్బంది సహాయం కోరాల్సి వచ్చింది.
అగ్నిమాపక సిబ్బంది ఆ ఇంటికి చేరుకుని, కింద పడ్డ మహిళను మంచంపై పడుకోబెట్టారు. బాధితురాలికి ఎలాంటి గాయాలు కాలేదని, ప్రస్తుతం ఆమె నిలకడగానే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే తమకు ఎన్నో ఎమర్జెన్సీ కాల్స్ వస్తుంటాయి. కానీ ఇలాంటి కాల్ రావడం అసాధారణం అని పేర్కొన్నారు.