Viral Video | టేస్టీగా, వేగంగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలనుకునే వారు ముందుగా ఆమ్లెట్నే ఎంచుకుంటారు. ఎగ్స్‌ను పగులకొట్టి, సాల్ట్ ఆనియన్స్, స్పైసెస్ జోడించి ఆ మిక్స్‌ను ప్యాన్‌పై వేసి రెండు వైపులా వేగనిస్తే టేస్టీ ఆమ్లెట్ రెడీ అవుతుంది.
అయితే ఈ సింపుల్ ప్రాసెస్ కూడా కష్టమనుకుందో ఏమో ఓ మహిళ ఆమ్లెట్‌ను తిరగేసేందుకు ఏకంగా దారాలను ఉపయోగించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఆమ్లెట్ పూర్తిగా రెడీ అయిన తర్వాత ఆమె దారాలను విప్పడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా 5.3 కోట్ల మంది వీక్షించారు.
ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. సమస్య లేకుండా పరిష్కారం దొరికిందని ఓ యూజర్ కామెంట్ చేయగా, మీ కోసం నాసా ఎదురుచూస్తోంది..ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారని మరో యూజర్ రాసుకొచ్చారు. చాలా తెలివైన ఆంటీ కానీ ఇలా మరోసారి చేయకండని మరో యూజర్ కామెంట్ చేశారు. ఆర్ఐపీ కుకింగ్ అని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో పేర్కొన్నారు.
Read More :
సింగరేణి కార్మికులకు కోటి ప్రమాద బీమా