న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) మెట్రో రైలు ట్రాక్ (Metro Track) పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్ మెట్రో స్టేషన్ (Shadipur Metro Station) నుంచి ట్రాక్ పైకి ఓ యువతి వచ్చింది. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ట్రాక్ రేలింగ్ పై కాలు పెట్టి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకోవాలనుకుంది. అయితే కింది నుంచి వెళ్తున్నవారు ఆమెను గమనించి వారించారు. కొద్ది సేపట్లోనే అక్కడ చాలామంది గుమికూడారు. అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. తన దగ్గరికి ఎవరైనా వస్తే దూకి చనిపోతానంటూ బెదిరించింది. దీంతో ఆమెను మాటల్లో పెట్టిన అధికారులు.. పోలీసులను ఆమె వద్దకు పంపించారు. క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు, మెట్రో సిబ్బంది ఆ యువతిని క్షేమంగా కిందికి తీసుకొచ్చారు.
అయితే ఆమె ట్రాక్‌పైకి ఎలా వచ్చిందనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. బలవన్మరనానికి ఎందుకు యత్నించిందనే సంగతి దర్యాప్తులో తేలుతుందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారిస్తున్నామని వెల్లడించారు.
Watch: Woman Threatens To Jump Off Metro Track. What Happened Next https://t.co/A1EPxjsHl8 pic.twitter.com/7p5OvrSTxJ
— NDTV (@ndtv) December 11, 2023