Watch: పోలీస్ చెంపపై కొట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిదంటే?
Woman Slaps On Duty Cop | డ్యూటీలో ఉన్న పోలీస్ చెంపపై ఒక మహిళ కొట్టింది (Woman Slaps On Duty Cop) . ఆ పోలీస్తో వాగ్వాదానికి దిగింది. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: డ్యూటీలో ఉన్న పోలీస్ చెంపపై ఒక మహిళ కొట్టింది (Woman Slaps On Duty Cop) . ఆ పోలీస్తో వాగ్వాదానికి దిగింది. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కారులో వచ్చిన ఒక మహిళ విధుల్లో ఉన్న పోలీస్తో వాదనకు దిగింది. అంతేగాక అతడి చెంప చెళ్లుమనిపించింది. డ్రెస్ కాలర్ పట్టుకుని మరోసారి చెంపపై కొట్టింది. ఇంతలో అక్కడున్న వారు జోక్యం చేసుకున్నారు. దీంతో ఆ మహిళ తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే మహిళ ఆ పోలీస్ చెంపపై ఎందుకు కొట్టింది అన్నది తెలియలేదు.
కాగా, ఆ సమయంలో అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు దీనిపై సీరియస్‌గా స్పందించారు. డ్యూటీలో ఉన్న పోలీస్‌పై ఆ మహిళ చేయి చేసుకోవడాన్ని చాలా మంది తప్పుపట్టారు. పోలీస్ చెంపపై కొట్టిన ఆ మహిళపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మహిళ కాబట్టే ఆమెను వదిలేశారా? ఇదే పని పురుషుడు చేసి ఉంటే పోలీసులు ఊరుకునేవారా? అని కొందరు ప్రశ్నించారు.
Kalesh b/w A Woman and on-Duty Police officer on Roadhttps://t.co/lMIaX3eSk6
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

