డెహ్రాడూన్: ఐదుగురు వ్యక్తులు ప్రయాణించిన కారు నదిలో పడింది. బోల్తా పడిన ఆ కారుపై ఒక మహిళ ఉన్నది. గమనించిన రెస్క్యూ సిబ్బంది ఆమెను కాపాడారు. (Woman rescued from sinking car) నదిలో గల్లంతైన నలుగురు కోసం గాలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిలో ఐదుగురు వ్యక్తులు కారులో ప్రయాణించారు. దేవప్రయాగ, కీర్తినగర్ మధ్య ఆ కారు అదుపుతప్పింది. ఘాట్ రోడ్డు పైనుంచి కింద ఉన్న అలకనంద నదిలో ఆ కారు పడింది.
కాగా, నదిలో బోల్తాపడి తేలుతున్న ఆ కారు టాప్‌పై ఒక మహిళ ఉన్నది. ఇది చూసిన కొందరు వ్యక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను కాపాడారు. గల్లంతైన మిగతా నలుగురి కోసం నదిలో గాలిస్తున్నారు. కారులో ప్రయాణించిన వారంతా పౌరీ గర్వాల్ జిల్లాలోని శ్రీకోట్ గ్రామానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. మరోవైపు మహిళను కాపాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
अलकनंदा नदी में कार गिरी तो महिला पलटी हुई कार के ऊपर बैठकर जान बचाने की गुहार लगाती रही। यह हादसा
देवप्रयाग और कीर्तिनगर के बीच का है। कार सवार पांच लोगों में से इसी महिला को बचाया जा सका और बाक़ी की तलाश जाती है। #Uttarakhand #srinagar #kirtinagar pic.twitter.com/CGoUsdOEgu— Ajit Singh Rathi (@AjitSinghRathi) April 12, 2025