Bengaluru | బెంగళూరు: బెంగళూరులోని వయలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను దారుణంగా హతమార్చారు. ఏసీపీ సతీశ్ కుమార్ కథనం ప్రకారం… మహాలక్ష్మీ(29) అనే మహిళను తన ఇంట్లోనే హతమార్చి, 32 ముక్కలుగా కోసి ఫ్రిడ్జిలో దాచిపెట్టారు. దాదాపు 4-5 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తుండటం వల్ల ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.
ఈ దారుణ హత్యపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత ఏడాది ఇలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హతమార్చి ముక్కలు చేసిన ఘటన తెలిసిందే.