బెంగళూరు: కర్ణాటకలోని ఓ మహిళ ఏడుగురిని వివాహం చేసుకుని, వారందరిపైనా వేధింపుల కేసు పెట్టి, మనోవర్తి పొందుతున్నారు. ఏడో భర్తపై పెట్టిన గృహ హింస కేసు విచారణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది.
దీపిక నారాయణ భరద్వాజ్ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. జడ్జి, ఆమె తరపు న్యాయవాదుల మధ్య జరిగిన సంభాషణ ఈ వీడియోలో కనిపించింది. ఆమె ఏడుగురిని పెళ్లి చేసుకుని, ఒక్కొక్కరితో 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కాపురం ఉంటున్నది.
ఆ తర్వాత గృహ హింస కేసు పెట్టి, మనోవర్తి పొందుతున్నది. ఇప్పటి వరకు ఆరుగురు మాజీ భర్తల నుంచి మనోవర్తి ఆమెకు లభించింది. ఇప్పుడు ఏడో భర్తపై కేసు విచారణ జరుగుతున్నది. జడ్జి మాట్లాడుతూ, ‘మీరు చట్టంతో ఆటలాడుతున్నారు’ అన్నారు.