ముంబై: మానవత్వంతో స్పందించిన ఒక యువకుడు తనకు తెలిసిన డాక్టర్‌కు వీడియో కాల్ చేసి ఆమె సూచనల మేరకు రైల్వే ప్లాట్‌ఫాంపై ఒక మహిళ ప్రసవానికి సహకరించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడాడు. ముంబైలో రైలులో ప్రయాణిస్తుండగా బుధవారం రాత్రి ఒంటి గంటకు ఒక గర్భిణికి నొప్పులు రావడంతో అదే ట్రైన్లో ఉన్న వికాస్ బెంద్రే చైన్ లాగి రామ్ మందిర్ స్టేషన్లో ఆపాడు.
అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చేసి తల్లీబిడ్డల పరిస్థితి ప్రమాదంగా కన్పించింది. దీంతో వికాస్ తన డాక్టర్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి ఆమె సూచనల మేరకు ఆ మహిళ ప్రసవం కావడానికి సహాయం చేశాడు.