Watch: బస్తాలు జారి మీద పడటంతో చిక్కుకున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Gets Trapped in Grain Sacks | ఆహార ఉత్పత్తుల బస్తాలు జారి ఒక మహిళపై పడ్డాయి. ఆ బస్తాల మధ్య చిక్కుకున్న ఆమె సహాయం కోసం కేకలు వేసింది. అక్కడే ఉన్న కూలీలు వెంటనే స్పందించారు. క్షణాల్లో బస్తాలను తొలగించారు. వాటి కింద చిక్కుకున్న ఆ మహిళను కాపాడారు.
ముంబై: ఆహార ఉత్పత్తుల బస్తాలు జారి ఒక మహిళపై పడ్డాయి. ఆ బస్తాల మధ్య చిక్కుకున్న ఆమె సహాయం కోసం కేకలు వేసింది. (Woman Gets Trapped in Grain Sacks ) అక్కడే ఉన్న కూలీలు వెంటనే స్పందించారు. క్షణాల్లో బస్తాలను తొలగించారు. వాటి కింద చిక్కుకున్న ఆ మహిళను కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. వాషి ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) గోడౌన్లో ఒక మహిళ చీపురుతో ఊడ్చసాగింది.
కాగా, అక్కడ వరుసగా పేర్చిన సుమారు 50 బస్తాలు జారీ ఆ మహిళపై పడ్డాయి. దీంతో ఆమె ఆ బస్తాల మధ్య చిక్కుకున్నది. కాపాడాలంటూ కేకలు వేసింది. ఆ సమయంలో అక్కడున్న కూలీలు వెంటనే స్పందించారు. నిమిషాల వ్యవధిలో ఆ బస్తాలను తొలగించారు. వాటి కింద చిక్కుకున్న ఆ మహిళను కాపాడారు. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు. మరోవైపు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://twitter.com/AHudawi13732/status/1769282430395900240?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1769282430395900240%7Ctwgr%5E77e531748bf08d2cb78503c218d22aa95167e1f1%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FAHudawi13732%2Fstatus%2F1769282430395900240
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

