Woman Elopes With Lover | పిల్లలను బస్సులో వదిలేసి.. ప్రియుడితో పారిపోయిన మహిళ
Woman Elopes With Lover | ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను బస్సులో వదిలేసింది. ఆ పిల్లలు అనాథలని, వారిని మరో బస్సు ఎక్కించాలని పేర్కొంటూ ఒక చీటీ రాసింది. ఒక పిల్లవాడి జేబులో ఆ చీటీ ఉంచి తన ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది.
ముంబై: ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను బస్సులో వదిలేసింది. ఆ పిల్లలు అనాథలని, వారిని మరో బస్సు ఎక్కించాలని పేర్కొంటూ ఒక చీటీ రాసింది. ఒక పిల్లవాడి జేబులో ఆ చీటీ ఉంచి తన ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. (Woman Elopes With Lover) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 30న ఒక మహిళ తన తండ్రికి చెందిన స్కూటర్, కొంత డబ్బును చోరీ చేసింది. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ నేపథ్యంలో తన స్కూటర్, ఇంటి నుంచి డబ్బును కూతురు చోరీ చేసి పారిపోయినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను పండర్పూర్-సంభాజీ నగర్ బస్సులో కూర్చోబెట్టింది. ‘ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు. దయచేసి యవత్మాల్ వెళ్లే బస్సులో వారిని ఎక్కించండి’ అని పేపర్‌పై రాసింది. అందులో తన తండ్రి మొబైల్ నంబర్ పేర్కొంది. ఆ తర్వాత తండ్రికి చెందిన చోరీ స్కూటర్‌పై ప్రియుడితో కలిసి పారిపోయింది.
మరోవైపు ఆ బస్సు బీడ్ చేరుకోగా అందులో ఉన్న ఇద్దరు పిల్లలు ఏడుస్తుండటాన్ని బస్ కండక్టర్ గమనించాడు. ఒక పిల్లవాడి జేబులో ఉన్న చీటీ తీసి చదివాడు. ఆ పిల్లలను వారి తల్లి బస్సులో వదిలేసినట్లు తెలుసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అప్పగించాడు.
అయితే, ఆ చీటీలో ఉన్న మొబైల్ నంబర్ పిల్లల తాతదిగా పోలీసులు తెలుసుకున్నారు. యవత్మాల్లో నివసిస్తున్న ఆయనకు ఫోన్ చేసి బీడ్ పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. అయితే అక్కడకు చేరుకున్న ఆయన ఆ పిల్లల కంటే తన స్కూటర్ గురించి ఎక్కువ ఆందోళన చెందాడు. మనవళ్ల సంరక్షణ బాధ్యత తీసుకునేందుకు ఆయన నిరాకరించాడు.
కాగా, ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు తన ఇద్దరు పిల్లలను వదిలేసి అతడితో కలిసి ఆ మహిళ పారిపోయినట్లు పోలీసులు తెలుసుకున్నారు. తాత కూడా పిల్లలను తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో బీడ్ బాలల సంక్షేమ కమిటీకి పోలీసులు అప్పగించారు. ఈ నేపథ్యంలో వారిని శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

