తిరువనంతపురం: ఒక వ్యక్తితో కలిసి మహిళ కారులో వెళ్తున్నది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త మరో కారులో ఫాలో అయ్యాడు. ఒక చోట ఆ కారును అడ్డగించి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. (Man Sets Car On Fire) మంటల్లో కాలి అతడి భార్య మరణించింది. ఆ కారులో ఉన్న వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. కేరళలోని కొల్లాంలో ఈ సంఘటన జరిగింది. 44 ఏళ్ల మహిళ ఒక వ్యక్తితో కలిసి కారులో ప్రయాణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త అయిన 50 ఏళ్ల పద్మరాజన్ మరో కారులో వారిని ఫాలో అయ్యాడు.
కాగా, మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కొల్లాం సిటీ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెమ్మమ్ముక్కు ప్రాంతంలో ఆ కారును పద్మరాజన్ అడ్డుకున్నాడు. ఆ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతడి భార్య అనీలా మంటల్లో కాలి మరణించింది. ఆ కారులో ఉన్న మరో వ్యక్తికి కాలిన గాయాలయ్యాయి.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు మృతురాలి భర్త పద్మరాజన్ను అరెస్ట్ చేశారు. కాలిన గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.