లక్నో: వాహనాల తనిఖీ సందర్భంగా ఒక పోలీస్ అధికారి లాఠీతో బైక్‌పై కొట్టాడు. బైక్ అదుపుతప్పడంతో భర్త వెనుక కూర్చొన్న మహిళ రోడ్డుపై పడింది. ఆమె మీద నుంచి డంపర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది. (Woman Dies During Police Checking) దీంతో స్థానికులు రోడ్డును బ్లాక్ చేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ఎస్ఐ కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి వేళ కళ్యాణ్పూర్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ తన భార్య అమరావతితో కలిసి బైక్‌పై పెళ్లి వేడుకకు బయలుదేరాడు.
కాగా, నిగోహి ప్రాంతంలోని ధూలియా మలుపు దగ్గర వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రిషిపాల్ లాఠీతో ప్రదీప్ బైక్‌పై కొట్టాడు. దీంతో అతడు బ్యాలెన్స్ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో బైక్ వెనుక కూర్చొన్న ప్రదీప్ భార్య అమరావతి రోడ్డుపై పడింది. అదే సమయంలో డంపర్ లారీ ఆమె పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది.
మరోవైపు స్థానికులు ఇది చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ మృతికి కారణమైన ఎస్ఐ రిషిపాల్‌పై మండిపడ్డారు. తెల్లవారుజామున 2 గంటల వరకు రహదారిని బ్లాక్ చేసి నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సలోనా కుష్వాహా కూడా అక్కడకు చేరుకుని ఎస్ఐ తీరును నిలదీశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ రిషిపాల్తోపాటు డంపర్ లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
UP
शाहजहांपुर में पुलिस चेकिंग के दौरान मोटरसाइकिल सवार के ना रूकने पर पुलिसकर्मी ने मारा डंडा, डंडा लगने से अनियंत्रित मोटरसाइकिल सवार सडक पर गिरे, पीछे आ रहें डंपर ने सड़क पर गिरी महिला को कुचला, महिला की दर्दनाक मौत,दो अन्य घायल, परिजनों ने सड़क पर लगाया जाम, मौके पर पहुंची… pic.twitter.com/xDj3K7dqPb— Mayur Talwar (@MayurTalwar_) April 21, 2025