లక్నో: భర్త, కుమారుడితో కలిసి ఒక మహిళ రోడ్డు దాటుతున్నది. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. (Car Hits Woman) గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడిన ఆమెను కొంత దూరం వరకు డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 54 ఏళ్ల గుడ్డో తన భర్త, కుమారుడితో కలిసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బంధువును కలిసింది. ఆ తర్వాత రాత్రి 9.15 గంటల సమయంలో నవాబాద్ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు ఆ ముగ్గురు ప్రయత్నించారు.
కాగా, రోడ్డు డివైడర్ వద్దకు వారు వచ్చిన తర్వాత ఒక కారు వేగంగా ఆ మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె గాలిలోకి ఎగిరి కారు బానెట్‌పై పడింది. అయితే డ్రైవర్ కారును ఆపలేదు. వంద మీటర్ల దూరం వరకు ఆ మహిళను అలా ఈడ్చుకెళ్లాడు. ఆమె రోడ్డుపై పడగా కారుతో అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించారు. మహిళను వేగంగా ఢీకొట్టిన కారును గుర్తించారు. కారు డ్రైవర్ ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
#WATCH: Speeding Car Kills Woman in Jhansi, UP. The incident occurred as she was crossing the road with two others, all captured on nearby CCTV.#UP #Jhansi #Roadaccident pic.twitter.com/Ov8j1HQc1L
— Republic (@republic) November 2, 2024