బెంగళూరు, సెప్టెంబర్ 22: బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువతి మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఉదంతం వయాలికావల్‌లోని ఒక అపార్ట్మెంట్లో వెలుగు చూసింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని చేసిన ఫిర్యాదుతో ఈ దారుణం శనివారం బయటపడింది.
పోలీసులు ఇంటి లోపలకు ప్రవేశించి ఫ్రిజ్‌లో 30 ముక్కలుగా నరికి ఉన్న ఒక యువతి మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు. ఈ ఘటన జరిగి నాలుగైదు రోజులు అయి ఉంటుందని భావిస్తున్నట్టు వెస్ట్‌జోన్ అడిషనల్ కమిషనర్ ఎన్ సతీశ్ కుమార్ తెలిపారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం మృతురాలిని జార్ఖండ్‌కు చెందిన 29 ఏండ్ల మహాలక్ష్మిగా గుర్తించారు. హేమంత దాస్ భార్య అయిన ఆమె ఐదు నెలల క్రితం భర్తతో గొడవపడి వచ్చి ఆ ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నది. ఆమె భర్తను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.