న్యూఢిల్లీ : గ్యాస్ సిలిండర్‌ను (Viral Video) మహిళ తలపై పెట్టుకుని డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సిలిండర్‌ను తలపై మోస్తూ ఆమె అలవోకగా డ్యాన్స్ చేయడమే కష్టమనుకుంటే కొద్దిసేపటికి స్టీల్ బిందెపై నిల్చుని డ్యాన్స్ కొనసాగించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.
ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయడం రిస్క్ అని పలువురు యూజర్లు కామెంట్ చేశారు. ఇంట్లో ఇలాంటి సురక్షితం కాని విన్యాసాలు ఎందుకు చేస్తారని నెటిజన్లు తలోరకంగా రియాక్టయ్యారు. ఈ క్లిప్‌ను దయచేసి ఎవరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దని ఓ యూజర్ రాసుకొచ్చారు.కరగం దుర్గా అనే ఇన్స్టాగ్రాం యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.
Read More :
Nitin Gadkari | హైడ్రోజన్ బస్సులో టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లిన నితిన్ గడ్కరీ.. వీడియో