ముంబై: ఒక మహిళ తన సవతి తండ్రిపై కత్తితో దాడి చేసింది. (Woman Attacks Stepfather With Knife) అతడి ప్రైవేట్ భాగాలు కోసింది. కత్తి చేతపట్టుకుని హంగామా చేసింది. గత కొన్నేళ్లుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల మహిళ తండ్రి మరణించడంతో ఆమె తల్లి మరో పెళ్లి చేసుకున్నది. అయితే సవతి తండ్రి రమేష్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని సవతి కూతురు ఆరోపించింది. అతడి ఆగడాలు భరించలేక దాడికి ప్లాన్ చేసింది.
కాగా, సవతి తండ్రి రమేష్ సవతి కూతురుపై మరోసారి లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో కొత్త విధానంలో చేద్దామని నమ్మించింది. అతడు కళ్లకు గంతలు కట్టుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కత్తితో ముఖం, మెడపై దాడి చేసింది. సవతి తండ్రి ప్రైవేట్ భాగాలను కోసింది. ఆ తర్వాత చేతిలో ఉన్న కత్తితో అక్కడ హంగామా చేసింది. రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది.
మరోవైపు స్థానికులు ఆ మహిళను నిలువరించారు. ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కత్తి దాడిలో గాయపడిన రమేష్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సవతి తండ్రిపై దాడి తర్వాత చేతిలోని కత్తితో ఆ మహిళ హంగామా చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
महाराष्ट्र : पालघर के वसई में 24 साल की लड़की ने अपने सौतेले पिता रमेश भारती का प्राइवेट पार्ट काट दिया और चाकू से गले पर भी वार किए। रमेश 2 साल से इस बेटी का यौन उत्पीड़न कर रहा था। घायल हॉस्पिटल में है, बेटी अरेस्ट है।@rafique_kamdar pic.twitter.com/wg2yV7epJo
— Sachin Gupta (@SachinGuptaUP) March 27, 2025