Gold | అహ్మదాబాద్ : శానిటరీ ప్యాడ్‌లో అక్రమంగా బంగారం తరలిస్తూ ఓ మహిళా ప్రయాణికురాలు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికురాలి నుంచి 73 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 49 లక్షల విలువ చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ బంగారాన్ని శానిటరీ ప్యాడ్‌లో దాచి ఉంచినట్లు తెలిపారు.
అబుదాబి నుంచి ఓ ప్రయాణికురాలు శానిటరీ ప్యాడ్‌లో బంగారాన్ని తరలిస్తున్నట్లు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఫ్లైట్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే, ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం మహిళా ప్రయాణికురాలి వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్‌ను పేస్ట్ రూపంలో తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.