ముంబై: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లింది. డిన్నర్ చేస్తుండగా చికెన్ ముక్క ఆమె గొంతులో ఇరుక్కున్నది. దీంతో ఊపిరాడకపోవడంతో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. (Woman dies of choking chicken) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 23న 27 ఏళ్ల మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఒక రిసార్ట్‌కు వెళ్లింది. రాత్రి వేళ రెస్టారెంట్లో వారిద్దరూ భోజనం చేస్తుండగా చికెన్ పీస్ ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి అందకపోవడంతో ఆ మహిళ అక్కడ కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికెన్ పీస్ గొంతులో ఇరుక్కోవడం వల్లనే ఆ మహిళ చనిపోయిందా లేక మరో కారణంతోనా అన్నది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.