Watch: బెడ్‌పై నిద్రిస్తున్న మామ గదికి నిప్పంటించిన మహిళ.. షాకింగ్ వీడియో వైరల్
Woman Sets Father-In-Law's Room On Fire | నిద్రపోతున్న మామ గదికి నిప్పంటించేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. (Woman Allegedly Sets Father-In-Law's Room On Fire) ఆ వృద్ధుడు నిద్ర నుంచి మేల్కొని మంటలు చూసి షాక్ అయ్యాడు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: నిద్రపోతున్న మామ గదికి నిప్పంటించేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. (Woman Allegedly Sets Father-In-Law’s Room On Fire) ఆ వృద్ధుడు నిద్ర నుంచి మేల్కొని మంటలు చూసి షాక్ అయ్యాడు. మంచానికే పరిమితమైన ఆ వ్యక్తికి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక మహిళ కాలుతున్న పేపర్ వంటి వస్తువును నిద్రిస్తున్న మామ గదిలోని బెడ్‌పైకి విసిరింది. వృద్ధుడైన ఆ వ్యక్తి మంటల కాంతికి నిద్ర నుంచి మేల్కొన్నాడు.
కాగా, దీనిని వీడియో తీసిన వ్యక్తి ఆ వృద్ధుడి బెడ్‌కు అంటుకున్న క్లాత్‌ను వెంటనే కింద పడేశాడు. దీంతో మంచానికే పరిమితమైన ఆ వృద్ధుడు కప్పుకున్న దుప్పటి లేదా మంచంపై ఉన్న పరుపునకు మంటలు వ్యాపించలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే ఆ వృద్ధుడు సజీవంగా కాలిపోయేవాడు. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో అన్నది తెలియలేదు.
మరోవైపు ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మామకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన ఆ కోడలిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచానికే పరిమితమైన వృద్ధుడి సజీవ దహనానికి యత్నించిన ఆ మహిళను గుర్తించి శిక్షించాలని కొందరు డిమాండ్ చేశారు. మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఇలాంటి దారుణాలు బయటపడుతున్నాయని మరి కొందరు పేర్కొన్నారు.
Woman trying to set the house on fire as she's upset about something
Dropping fire where old father-in-law is sleeping
Thank god there are phones now to record such deranged behaviour else no one would believe husbandspic.twitter.com/uqFr4EBXlY
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 1, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- father in law
- On Fire
- room
- sets
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

