Wipro Layoffs | లాభాలు పెంచుకొనేందుకు.. వందలాది మంది ఉద్యోగులపై విప్రో వేటు!
ఉద్యోగాల ఊచకోత కొత్త ఏడాదిలోనూ కొనసాగుతున్నది. ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేకుండా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
- వందల మందికి ఉద్వాసన
- 12 వేల మందిపై యూపీఎస్ వేటు!
- పేపాల్‌లో 2,500 మంది ఇంటికి
- కొత్త ఏడాదిలోనూ భారీగా కోతలు
Wipro Layoffs | న్యూఢిల్లీ, జనవరి 31: ఉద్యోగాల ఊచకోత కొత్త ఏడాదిలోనూ కొనసాగుతున్నది. ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేకుండా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు, ఖర్చులు తగ్గింపు, ఆదాయాలు మెరుగుపర్చుకొనే ప్రణాళికలో భాగంగా వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఇప్పటికే ఆ జాబితాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు ఉండగా.. తాజాగా యునైటెడ్ పార్సిల్ సర్వీస్(యూపీఎస్), ఫిక్ టెక్ సంస్థ పేపాల్, ఐటీ కంపెనీ విప్రోలు తమ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటనలు చేశాయి.
లాభాలు పెంచుకొనేందుకు..
మధ్య స్థాయి ఉద్యోగులే లక్ష్యంగా ఐటీ సంస్థ విప్రో ఉద్యోగుల తొలగింపు చేపట్టనున్నట్టు ది ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది. తగ్గిన ఆదాయాలను మెరుగుపర్చుకొనే ప్లాన్‌లో భాగంగా వందలాది ఉద్యోగులుపై కంపెనీ వేటు వేయనున్నదని, తొలగింపుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సంబంధిత వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నది. భారత్‌లోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో విప్రోకు అతి తక్కువ లాభాలు ఉన్నాయని తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో విప్రో లాభాలు 16 శాతం వద్ద ఉండగా.. ఇది టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువ అని ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది.
9% ఉద్యోగులపై పేపాల్ వేటు
9 శాతం మంది ఉద్యోగులను(2,500 మంది) తొలగించనున్నట్టు పేపాల్ సీఈవో అలెక్స్ క్రిస్ తాజాగా ప్రకటించారు. సమర్థత, ఆటోమేషన్ వినియోగం, వ్యాపారాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని అనుకొంటున్నట్టు ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఆయన పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. తొలగింపునకు సంబంధించి ఈ వారం చివర్లో తెలియజేస్తామని మెమోలో తెలిపారు. పేపాల్ ఇదివరకే దాదాపు 2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
ఖర్చుల తగ్గింపులో భాగంగా
ఆర్థిక సవాళ్లు, ఖర్చుల తగ్గింపులో భాగంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు యునైటెడ్ పార్సిల్ సర్వీస్(యూపీఎస్) ప్రకటించింది. వాల్‌స్ట్రీట్ అంచనాల కంటే వార్షిక ఆదాయాలు తగ్గిన నేఫథ్యంలో, దీనికి స్పందనగా ప్రత్యామ్నాయ వ్యూహాలు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నది. దాదాపు 100 కోట్ల డాలర్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలని లక్ష్యం పెట్టుకొన్నట్టు యూపీఎస్ సీఈవో కరోల్ టోమ్ వెల్లడించారు. గత ఏడాది ఎదురైన ప్రతికూలతను అధిగమించాలని అనుకొంటున్నామని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

