న్యూఢిల్లీ: సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించడంలో రైల్వేశాఖ కీలక అడుగులు వేసినట్లు ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖవంతంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించేవరకు తాము ఆగబోమని ఆయన అన్నారు. ఇవాళ మూడు వందేభారత్ రైళ్లను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల నుంచి అవరోధాలను తన కష్టంతో రైల్వే శాఖ అధిగమించినట్లు ఆయన చెప్పారు. ప్రజల్లో కొత్త ఆశయాలు, పరిష్కారాలు అందజేసిందన్నారు. భారతీయ రైల్వే ద్వారా ప్రతి ఒక్కరికీ సుఖవంతమైన ప్రయాణం అందించేందుకు వరకు తాము ఆగేదిలేదన్నారు.
మీరట్ నుంచి లక్నో, మధురై నుంచి బెంగుళూరు, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ వరకు వెళ్లే వందేభారత్ రైళ్లను ఇవాళ మోదీ ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధి వేగంగా ఉందని, దీంతో 2047 వికసిత్ భారత్ లక్ష్యం మరింత సులువు అవుతుందన్నారు. మీరట్ నుంచి లక్నో వెళ్లే వందేభారత్ రైలు వల్ల గంట సమయం ఆదా అవుతుంది. ఇక ఎగ్మోర్-నాగర్‌కోయిల్ మధ్య రైలు వల్ల రెండు గంటలు, మధురై-బెంగుళూరు రైలు వల్ల గంటన్నర సమయం ఆదాకానున్నది.
वंदे भारत आधुनिक होती भारतीय रेल का नया चेहरा है। आज हर शहर में, हर रूट पर वंदे भारत की मांग है: माननीय प्रधानमंत्री श्री @narendramodi जी#VandeBharatExpress pic.twitter.com/8e2gduYE1F
— Ministry of Railways (@RailMinIndia) August 31, 2024