పాల్ఘర్ : రాష్ర్టానికి నాయకత్వం వహించేందుకు ‘నేను మళ్లీ వస్తా’ అంటూ మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఎక్స్‌లో పోస్టు కావడంపై పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే వివరణ ఇచ్చారు. ఆ పాత వీడియోను ఉత్సాహవంతుడైన పార్టీ కార్యకర్త ఒకరు దాన్ని పోస్టు చేశారని, దానిని తప్పుగా అర్థం చేసుకోవద్దని అన్నారు. శుక్రవారం పాల్ఘర్ జిల్లా పర్యటనలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు సీఎం ఏక్నాథ్ షిండే నాయకత్వంలోనే వెళ్తామన్నారు.