లక్నో: త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. లక్నోలో ఉన్న ఆయన తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని మీడియాతో అన్నారు. ఎన్నికల్లో పొత్తు కోసం ఒకటి రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అయితే స్థానిక పార్టీలతో పొత్తు ఉంటుందా లేదా అన్నది కాలమే చెబుతుందన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచే పరిస్థితిలో ఉన్నదని ధీమా వ్యక్తం చేశారు.