KS Eshwarappa | కర్ణాటక బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప తిరుగుబాటు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడి
KS Eshwarappa | కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) తిరుగుబాటు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో షిమోగా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బెంగళూరు: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) తిరుగుబాటు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో షిమోగా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నేను శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా’ అని తెలిపారు. బీజేపీని, దాని సిద్ధాంతాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేసేందుకు చేస్తున్న పోరాటమని అన్నారు.
కాగా, తిరుగుబాటు నేపథ్యంలో బీజేపీ తనకు నోటీసు జారీ చేయవచ్చని లేదా తనను పార్టీ నుంచి బహిష్కరించవచ్చని కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిస్తే తల్లి అయిన బీజేపీ పాదాల వద్దకు మద్దతుదారులు తనను కలుపుతారన్న నమ్మకం తనకు ఉందన్నారు. తన కుమారుడికి హవేరీ నియోజకవర్గం టికెట్ నిరాకరించడానికి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కారణమని ఆరోపించారు.
మరోవైపు యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ బీ వై రాఘవేంద్ర మరోసారి షిమోగా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ సీఎం ఎస్ బంగారప్ప కుమార్తె, కన్నడ సినీ నటుడు శివరాజ్‌కుమార్ భార్య, దివంగత డాక్టర్ రాజ్‌కుమార్ కోడలు గీతా శివరాజ్‌కుమార్‌ను కాంగ్రెస్ అభ్యర్థినిగా ఆ పార్టీ పోటీకి దించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

