గువాహటి : ‘లవ్ జీహాద్’ కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించేందుకు వీలుగా ఓ చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. రాష్ట్ర బీజేపీ శాఖ కార్యనిర్వాహక సభ్యుల సమావేశంలో ఆదివారం ఆయన ఈ వివరాలను తెలిపారు. స్వస్థలానికి సంబంధించిన విధానాన్ని కూడా త్వరలో తెస్తామని చెప్పారు. దీని ప్రకారం కేవలం అస్సాంలో జన్మించినవారు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులవుతారని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు కల్పించిన ఒక లక్ష ఉద్యోగాల్లో సహజసిద్ధ స్థానికులు ప్రాధాన్యం పొందారని చెప్పారు. హిందూ, ముస్లింల మధ్య భూముల అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలను ప్రభుత్వం నిరోధించజాలదని, అయితే ముందుగా ముఖ్యమంత్రి సమ్మతిని పొందడం తప్పనిసరి చేశామని తెలిపారు.