న్యూఢిల్లీ, జూలై 18: గోవులను వధించరాదంటూ నిషేధాజ్ఞలు జారీచేయలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. నిషేధం విధించటంపై చట్టసభలే నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది. చట్టం చేయాలంటూ చట్టసభ సభ్యులపై న్యాయస్థానం ఒత్తిడి చేయదని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవులు, పశువులకు రక్షణ కల్పించటంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) 2018లో జారీ చేసిన ఉత్తర్వుల్ని వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.