తిరువనంతపురం : ఫొటోలు తీసుకునేందుకు అడవిలోకి వచ్చిన ఓ వ్యక్తిని ఏనుగు వెంటాడిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. కేరళలోని వయనాద్ ముతంగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోకి ఫొటోలు తీసుకునేందుకు ఓ వ్యక్తి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఏనుగు వెంబడించగా ఎట్టకేలకు వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.
వైరల్ వీడియోలో ఏనుగు వెంటాడటంతో ప్రాణ భయంతో వ్యక్తి పరుగులు పెడుతుండటం కనిపిస్తుంది. రోడ్డుపైన నిలుచున్న పలువురు టూరిస్టులు ఏనుగును చూసి కేకలు వేయడంతో అది వెనుతిరిగింంది. ఆపై తమిళనాడుకు చెందిన యువకుడిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో వన్యప్రాణులను మనుషులు ఎలా డిస్ట్రబ్ చేస్తున్నారనే దానిపై ఆన్లైన్ వేదికగా హాట్ డిబేట్ సాగింది. వన్యప్రాణులను సంరక్షించాలని, వాటి ప్రశాంతతకు భగ్నం కలిగించరాదని ఓ యూజర్ రాసుకొచ్చారు. వన్యప్రాణుల జీవనంలో జోక్యం చేసుకోకుండా ప్రకృతిని కాపాడటంలో మనవంతు పాత్ర నిర్వర్తించాలని మరో యూజర్ కామెంట్ చేశారు.\
Read More