లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా ఉలావ్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య, ఆమె ప్రియుడు విషం ఇవ్వడంతో సునీల్ అనే వ్యక్తి మరణించాడు. తన కోడలు, అదే గ్రామానికి చెందిన ఓ పురుషుడు తన కుమారుడికి విషం ఇచ్చి చంపారని సునీల్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు జూలై 24న కేసు నమోదు చేసినట్లు ఫిరోజాబాద్ నగర ఎస్పీ రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.
సునీల్ భార్య, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఆయన చెప్పారు. తన భార్యకు, మరో వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు సునీల్‌కి తెలిసిందని, దీంతో ఆహారంలో విషం కలిపి వారిద్దరూ సునీల్‌ని హతమార్చారని ఎస్పీ తెలిపారు.