కళ్లేదుటే భార్య ఆత్మహత్య… కాపాడకపోగా వీడియో తీసిన భర్త
భార్య శోబితా ఆత్మహత్యను గమనించిన భర్త సంజయ్ ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించలేదు. అలాగే భార్యను కాపాడకపోగా తన మొబైల్లో వీడియో రికార్డు చేశాడు.
లక్నో: ఒక వ్యక్తి భార్య అతడి కళ్ల ముందే ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది చూసి కూడా భర్త ఆమెను నిలువరించి కాపాడలేదు. పైగా భార్య ఆత్మహత్యను మొబైల్ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. అనంతరం భార్య ఆత్మహత్య విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. సంజయ్ గుప్తా, శోబితా గుప్తాలకు ఐదేళ్ల కిందట వివాహమైంది. మంగళవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన శోబితా, భర్త సంజయ్ ఎదుటే ఆత్మహత్య చేసుకోసాగింది. బెడ్ రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.
మరోవైపు భార్య శోబితా ఆత్మహత్యను గమనించిన భర్త సంజయ్ ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించలేదు. అలాగే భార్యను కాపాడకపోగా తన మొబైల్లో వీడియో రికార్డు చేశాడు. ఆమె చనిపోయిన విషయాన్ని అత్తింటి వారికి సమాచారం ఇచ్చాడు. దీంతో వారు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్నారు.
కాగా, శోబితాకు సీపీఆర్ చేస్తున్న సంజయ్‌ను గమనించి అతడిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుండగా రికార్డు చేసిన వీడియోను వారికి చూపించాడు. శోబితా తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో శోబితా కుటుంబ సభ్యులు సంజయ్ గుప్తాపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

