న్యూఢిల్లీ, మే 11: అత్యంత బలమైన సౌర తుఫాను శుక్రవారం భూమిని తాకిందని.. దీని ప్రభావం పవర్ గ్రిడ్స్, జీపీఎస్‌పై పడుతుందని అమెరికన్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) తెలిపింది. 2003 నాటి సౌర తుఫాను కన్నా తీవ్రమైనదని పేర్కొన్నది.
సూర్యుని వాతావరణంలోని బాహ్య ప్రదేశం నుంచి ప్లాస్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ భూమి వైపు వస్తున్నాయని తెలిపింది. ఇది ఈ వారాంతం వరకు కొనసాగవచ్చునని చెప్పింది. సౌర తుఫాను కారణంగా జీపీఎస్, పవర్ గ్రిడ్స్, శాటిలైట్ నేవిగేషన్, ఇతర టెక్నాలజీలపై ప్రభావం పడుతుందని వివరించింది. ఈ సమాచారాన్ని కీలకమైన మౌలిక సదుపాయాల ఆపరేటర్లకు తెలియజేసినట్లు చెప్పింది. సౌర తుఫాను ముగిసినప్పటికీ, జీపీఎస్ శాటిలైట్లు, గ్రౌండ్ రిసీవర్ల మధ్య సిగ్నల్స్ దెబ్బతినే అవకాశం ఉంటుందని ఎన్ఓఏఏ వివరించింది.