జైపూర్: రాజస్థాన్(Rajasthan)లో అధికారంలోకి వచ్చి 25 రోజులు దాటినా.. ఎందుకు బీజేపీ సర్కార్ క్యాబినెట్‌ను ఏర్పాటు చేయలేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోస్రా ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ గాంధీ యువ మిత్ర ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఎందుకు మూసివేశారని కూడా ఆయన అడిగారు. 25 రోజులు గడిచినా కూడా ఇంకా క్యాబినెట్‌ను విస్తరించలేదుని, సీఎంవో కార్యాలయం ఏం చేస్తోందని, ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారని, 25 రోజులు దాటిన సీఎం ఆఫీసు ఏం చేస్తోందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలను గమినిస్తే .. చీటింగ్ జరుగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారని,క్యాబినెట్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం భజన్ లాల్ శర్మ దీనిపై ఎందుకు స్పందించడం లేదన్నారు. రతుసర్లో దళితుడు మృతిచెందిన కేసులో అరెస్టు చేయాలని కోరారు. డిసెంబర్ 15వ తేదీన రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ బాధ్యతలు స్వీకరించారు.
करीब 25 दिन बाद भी भाजपा से मंत्रिमंडल नहीं बना, CMO में अधिकारी नहीं लगे।
सरकार को कौन चलाएगा ये समझ से परे है और जनता खुद को ठगा महसूस कर रही है कि आखिर मंत्रिमंडल बनने में अंगद का पैर लगाकर कौन खड़ा है।
कहीं ऐसा ना हो कि 100 दिन की कार्ययोजना बनाने में भी इनको 100 दिन लग… pic.twitter.com/W7LjOg9iTE
— Govind Singh Dotasra (@GovindDotasra) December 26, 2023