Nipah virus | తిరువనంతపురం: నిపా వైరస్ వ్యాప్తితో కేరళలో భయాందోళన నెలకొన్నది. వైరస్ బారిన పడిన మొదటి వ్యక్తి ఆగస్టు 30న చనిపోగా, అతడికి నిపా ఎలా సోకిందనే విషయాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఆ వ్యక్తి ఫోన్ కాల్ రికార్డ్‌ను పరిశీలిస్తున్నారు.
మొబైల్ టవర్ లొకేషన్లను గుర్తిస్తున్నామని, కేంద్ర బృందాలు పలు చోట్ల గబ్బిలాల నుంచి నమూనాలు సేకరిస్తున్నాయని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు. శుక్రవారం నాటికి రాష్ట్రంలో ఆరు కేసులు నమోదుకాగా, కొత్త కేసులేమీ లేవని ప్రకటించారు. హై రిస్క్‌లో ఉన్న 94 మంది నమూనాలు పరీక్షించగా, నెగిటివ్ వచ్చిందని తెలిపారు.