Shitalben Kalathiya | అహ్మదాబాద్: నిత్యం వందలాది మంది పర్యాటకులు వచ్చే పహల్గాం లాంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతంలో లేసమాత్రమైన భద్రత కూడా ఎందుకు లేదు? అక్కడ కనీసం చిన్నపాటి మెడికల్ కిట్ కూడా ఎందుకు అందుబాటులో లేదు? అని కాల్పుల్లో తన భర్తను కోల్పోయిన శీతల్బెన్ కథాలియా అనే బాధితురాలు ఆగ్రహంతో ప్రశ్నించింది.
సూరత్ నివాసి అయిన శైలేష్ కథాలియాను అతని భార్య, కుమారుడి ఎదుటే టెర్రరిస్టులు కాల్చి చంపారు. తన భర్తను కాల్చిన అనంతరం ఆ ఉగ్రవాది నవ్వుతూ తన భర్త మరణించే వరకూ అక్కడే ఉన్నాడని శీతల్బెన్ తెలిపింది. అంతా అయిపోయిన తర్వాత అక్కడకు భద్రతా సిబ్బంది తాపీగా వచ్చారని అక్కడే ఉన్న ఆమె కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.