టీకా ధరల్లో తేడా ఎందుకు?

వ్యాక్సినేషన్లో వయసు విభజన సమంజసమా?
గ్రామీణులకు ‘కొవిన్’పై అవగాహన ఉంటుందా?
టీకా పాలసీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ, మే 31: కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సుప్రీంకోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. టీకా విధానం-సేకరణ, గ్రామీణ ప్రాంతాల్లో టీకా రిజిస్ట్రేషన్, టీకా ధరల్లో తేడా తదితర సమస్యలపై కేంద్రాన్ని ఆరా తీసింది. అలాగే, మూడోదశలో పిల్లలు, గ్రామీణులపై వైరస్ పంజా విసురనున్నదన్న నివేదికలపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఏదైనా అధ్యయనాన్ని నిర్వహించారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రధాన ప్రశ్నలు..
టీకా విధానం-సేకరణ: వ్యాక్సినేషన్ విధానంలో వయస్సును బట్టి విభజన ఎందుకు? టీకాల సేకరణలో భిన్న విధానాలను ఎందుకు తీసుకొచ్చారు? 45 ఏండ్లు పైబడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్లనే ఈ విధానం తీసుకొచ్చామంటే, రెండోదశలో 18-44 ఏండ్ల వారిపైనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది కదా!
గ్రామీణ ప్రాంతాల్లో టీకా రిజిస్ట్రేషన్: టీకా వేసుకోవాలంటే ‘కొవిన్’ పోర్టల్‌లో పేర్ల నమోదు తప్పనిసరి అని నిబంధన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యమేనా? గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కంప్యూటర్, ఇంటర్నెట్పై అవగాహన ఉంటుందని నిర్ధారణకు వచ్చారా? క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆకలింపు చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి.
టీకా ధరల్లో తేడా: వ్యాక్సినేషన్లో ఒకే రకమైన టీకాలను వేస్తున్నప్పుడు వాటి ధరల్లో వ్యత్యాసమెందుకు? తయారీ సంస్థలు టీకా డోసులను కేంద్రానికి ఒక ధరకు, రాష్ర్టాలకు ఎక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తున్నాయి? కంపెనీలే వ్యాక్సిన్ల ధరలను ఎలా నిర్ణయించాయి?: టీకాల కొరత రాకుండా కేంద్రమే చర్యలు చేపట్టాలి. వ్యాక్సిన్ డోసులు లేకపోవడంతో పలు రాష్ర్టాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి. అది అంత మంచిది కాదు. కేంద్రమే ఆ బాధ్యతను తీసుకుని సమస్యను పరిష్కరించాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

