Om Parvat | పితోరాఘడ్ : గత వారం ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓం పర్వతంపై మంచు పూర్తిగా మాయం కావడం సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేసింది. గత అయిదేండ్లలో హిమాలయాల ఎగువ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు, కొద్దిగా మంచు కురవడం, వాహన కాలుష్యం పెరుగుదల, భూతాపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు తెలిపారు. అయితే సోమవారం రాత్రి ఈ పర్వతంపై మంచు కురిసింది.
వ్యాస్ లోయలో 14 వేల అడుగుల ఎత్తులో ఉండే ఓం పర్వతంపై హిందీ పదం ‘ఓం’ ఆకారంలో సహజంగా మంచు ఏర్పడుతుంది. ఈ కారణంగా ఈ పర్వతానికి ఆ పేరు వచ్చింది. హిమాలయాల్లోని జోలింగ్‌కాంగ్‌ను ప్రధాని గతేడాది అక్టోబర్‌లో సందర్శించిన తర్వాత పర్యాటకుల తాకిడి పది రెట్లు పెరగడం కూడా తాజా పరిస్థితికి కారణమని నిపుణులు వాపోయారు.